పట్టణ గృహ నిర్మాణానికి సహకరించండి
పట్టణ గృహ నిర్మాణానికి సహకరించండి

పట్టణ గృహ నిర్మాణానికి సహకరించండి

పట్టణ గృహ నిర్మాణానికి సహకరించండి

Saturday, Jan 19, 2019
  • మీరుణం.. పేదలకు వరం
  • బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
  • ఫిబ్రవరి నెలాఖరులోగా 1,75,000 ఇళ్లు సిద్ధం
పేదలకు పెద్దఎత్తున గృహ నిర్మాణం చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని, దీనిని విజయవంతంగా పూర్తి చేసేందుకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పట్టణ పేదల గృహ నిర్మాణంపై శుక్రవారం సచివాలయంలో టిడ్కో, మెప్మా, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రుణాల మంజూరును వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని 44 బ్యాంకులు ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. గృహ రుణాల మంజూరుపై బ్యాంకులు ప్రతి రోజూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

ఇప్పటివరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని బ్యాంకులు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలాఖరులోగా 1,75,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని, దీనికి అనుగుణంగా నడుచుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రుణాల మంజూరులో కఠినంగా వ్యవహరించకుండా, పేదల కోసం నిబంధనలు సరళీకరించుకోవాలని సూచించారు. సిబిల్ స్కోర్ విషయంలో పరిపాలనాపరమైన అనుమతులు సంబంధిత బ్రాంచ్ స్థాయిలోనే ఉండాలన్నారు.

రాష్ట్రంలో 4,82,597 మంది పట్టణ గృహ లబ్దిదారులకు రుణాలు ఇవ్వాలని ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, ఇప్పటివరకు కేవలం 5,988 మందికి రూ.199.62 కోట్లు బ్యాంకులు రుణంగా అందించాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం పట్టణ గృహ నిర్మాణ లబ్దిదారులకు ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్‌కు చెందిన 20 బ్యాంకులు మాత్రమే రుణాలు ఇస్తున్నాయని తెలిపారు.

పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్ (ఏహెచ్‌పీ) పథకం కింద 5,29,786 ఇళ్లు మంజూరు చేశామని, 4,60,492 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయని, వీటిలో 3,60,365 ఇళ్ల నిర్మాణం ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో 1,42,061 శ్లాబుల నిర్మాణం పూర్తయ్యాయని, 75,284 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు.

అలాగే ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణం (బీఎల్‌సీ) కింద 4,28,444 మంజూరు కాగా, 1,11,613 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, వీటిలో 73,752 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Write Comments
Comments 2
Similar Updates