The Bill will soon be introduced in the AP Assembly to make it an Act. It was in the last Cabinet meeting that the State government had decided on the Kapu sub-quota.
Another important decision taken by the Cabinet was the withdrawal of police cases on those who participated in the protests demanding Special Category Status. This was also assured earlier by the Chief Minister. Police cases on those who had agitated for united Andhra Pradesh, Polavaram and Vamsadhara projects will also be withdrawn.
The Cabinet gave a nod to the BC sub-plan that was introduced by the State government for the benefit of Backward Classes. The decision to provide 150 units of free power per month to salons was also taken.
An integrated plan of Rs. 55,343 Cr for the development of Amaravati capital city by CRDA was also approved. This includes expenditure on the construction of buildings, roads and basic infrastructure amenities among others. The Cabinet also lent its nod to the CRDA borrowing Rs. 37,112 Cr by hypothecating projects in the capital and raising Rs. 500 Cr through public bonds. The meeting also approved a proposal to borrow US $715 million under Externally Aided Projects (EAP).
The Cabinet also allotted land to seven institutions in Amaravati and approved the decision to extend free power to weavers and Nayee Brahmins (Barbers). The Dobhi ghats, salons and weavers’ workshops would get free power on par with farmers.
The proposal to establish a medical college at Eluru at a cost of Rs. 260 Cr with a schedule for fund release: Rs. 140 Cr (in the first year), Rs. 90 Cr (in the second year) and Rs. 30 Cr (in the third year), was also approved.
The Ministers congratulated CM for the launch of commercial production at Kia Motors in Anantapur.
Other major decisions:
Bill to cut 2% excise duty on petrol and diesel
Rs. 10,000 to SHG women to be paid in 3 instalments of Rs. 2,500, Rs. 3,500 and Rs. 4,000
పేదలకు మేలు చేసేలా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన అన్ని వరాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. పింఛన్ల రెట్టింపు, డ్వాక్రా మహిళలకు రూ.10 వేల సాయం, నాయీబ్రాహ్మణులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తువంటి సంక్షేమ పథకాలకు పచ్చజెండా ఊపింది. వివిధ సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసే దిశగానూ మంత్రిమండలి చర్చించింది. ప్రస్తుతం ఉన్న ఆయా సమాఖ్యలను కార్పొరేషన్లుగా మార్చే విషయంలో నియమ నిబంధనలపైనా చర్చించింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం వివిధ సంస్థలు, సంఘాలు చేసిన ఆందోళనల్లో పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. సమైక్యాంధ్ర, హోదా ఉద్యమాలతోపాటు పోలవరం, వంశధార నిర్వాసితుల కోసం పోరాడిన వారిపై కేసులనూ ఎత్తివేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడినవారిపై కేసులనూ తొలగించనున్నారు. రాజధాని అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టును మంత్రివర్గం ఆమోదించింది. విదేశీ ఆర్థికసాయం పథకం కింద 715 మిలియన్ అమెరికన్ డాలర్లతో ఈ ప్రాజెక్టు చేపడతారు. రూ.55,343 కోట్లతో రాజధాని సమగ్ర ఆర్థిక ప్రణాళికకు అనుమతించింది. అమరావతి నమూనాలో కొచ్చిలో మోడల్ టౌన్షిప్ ఏర్పాటుచేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడం మనకు గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో గురువారం సమావేశమైన మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెంచిన పింఛన్లను ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వీలైతే ప్రతి ఇంటికి వెళ్లి అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంతో ఉపఆరోగ్య కేంద్రాలను ఈ-కేంద్రాలుగా మార్చాలని మంత్రిమండలి నిర్ణయించింది. టెలిమెడిసన్ ద్వారా రోగులకు సేవలందిస్తారు. తొలిదశలో తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాలలో దీన్ని ప్రారంభిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి రూ.260 కోట్లను వచ్చే మూడేళ్లలో విడతలవారీగా వెచ్చించనున్నారు.
వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత, ఒంటరి మహిళ, మత్స్యకారులు, హెచ్ఐవీ బాధితులు, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, 40 నుంచి 70శాతం అంగవైకల్యం ఉన్నవారికి ఇస్తున్న రూ.వేయి పింఛను రూ.రెండు వేలకు పెంపు.
80శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు పింఛను రూ.1500 నుంచి రూ.3000కు పెంపు.
ఎన్టీఆర్ భరోసా కింద అదనంగా మరో 3.55 లక్షల మందికి పింఛను లబ్ధి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం.
ఇప్పటికే దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు ఇస్తుండగా ఎంబీసీలకు వంద యూనిట్లు, చేనేత కార్మికులకు 150 యూనిట్లు ఉచితంగా ఇచ్చేలా నిర్ణయించింది.
- విశాఖ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మంది ఖైదీలకు విముక్తి. ఇప్పటికే ఐదు నుంచి ఏడేళ్ల జైలుశిక్ష అనుభవించి 65 ఏళ్ల పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక పరిస్థితుల కింద ఉపశమనం కల్పించాలని నిర్ణయం.
- అమరావతిలో శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయాల నిర్మాణానికి రూ.4,900 కోట్ల నిధుల సమీకరణకు సీఆర్డీఏకు అనుమతించింది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంటు 20శాతం కాగా మిగిలిన 80శాతం హడ్కో, వాణిజ్య బ్యాంకులనుంచి రుణంగా తీసుకునే ప్రతిపాదనకు ఆమోదం.
- 9న సామూహిక గృహప్రవేశాల వేడుకను నిర్వహించాలి.
భూధార్‌కు చట్టబద్ధత!
- దేశంలో తొలిసారి ప్రవేశపెట్టిన భూధార్‌కు చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చట్టం-1908 సవరణకు ఆమోదం. రిజిస్ట్రేషన్ (ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్) బిల్లు-2018 పేరుతో శాసనసభ సమావేశాల్లో బిల్లు
- ఏపీ మార్కెట్‌కమిటీ ఎంప్లాయీస్ (పెన్షన్, గ్రాట్యుటీ) నిబంధనలు- 1980 సవరణ. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సీఎంఎఫ్ సర్వీసు పెన్షనర్లకు ఆన్లైన్ ద్వారా పింఛన్లు చెల్లించేలా సాఫ్ట్వేర్ రూపకల్పన 2092 పోస్టులకు తిరిగి నియామకాలు
- రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి కేటాయించిన 2092 మంది ఉద్యోగులకు తిరిగి నియామకాలు.
- ఎన్నికల దృష్ట్యా ఆరునెలల కాలపరిమితితో ఎన్నికల ప్రధాన కార్యాలయం.. జిల్లా కార్యాలయాలకు అవసరమైన సిబ్బంది నియామకం.
- సుబాబుల్ రైతులను ఆదుకోవడంపై మంత్రిమండలిలో చర్చించారు. సుమారు రూ.70 కోట్ల బడ్జెట్ అవుతుందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. అదనంగా రూ.300 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకోవడంపై పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
మంత్రివర్గ నిర్ణయాలు మరికొన్ని...
- కియామోటార్స్తో ఏపీ ప్రభుత్వం గతేడాది నవంబరు 15న చేసుకున్న ఒప్పందానికి ఆమోదం.
- ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద మౌలిక సదుపాయాల కల్పనకు రూ.47.57కోట్లు కేటాయింపు.
- ఎన్టీఆర్ గ్రామీణ, ప్రీ-ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ, బీఎల్సీ గృహనిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.19.95కోట్ల మంజూరు.
- ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా చేయూత కోసం స్టేట్ ఛానెలైజింగ్ ఏజెన్సీల ఏర్పాటు.
- ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలు పొందేందుకు ప్రభుత్వం రూ.50కోట్ల హామీ. 2% గ్యారంటీ కమిషన్ చెల్లింపు.
- అవసరమైన సహకార చక్కెర కర్మాగారాలకు డీఫాల్ట్ గ్యారంటీ పథకం కింద ఎన్సీడీసీ నుంచి రూ.200కోట్ల రుణం.
‘ఉపాధి’కి త్వరలో 500 కోట్ల నిధులు..
- ఉపాధిహామీ పథకం కింద కేంద్రం నుంచి రూ.1,700 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మంత్రి లోకేశ్ మంత్రివర్గ సమావేశంలో వివరించారు. ఇటీవల దిల్లీ వెళ్లి సంబంధిత శాఖ అధికారులతో చర్చించినప్పుడు... త్వరలో రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు విడుదల చేస్తామని హామీ వచ్చిందన్నారు. మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తామని స్పష్టం చేశారని తెలిపారు.
రాజధానికి ప్రత్యేక ప్రణాళికలు
- రాజధాని కోసం రూ.55,343 కోట్లతో సిద్ధం చేసిన సమగ్ర ఆర్థిక ప్రణాళికను మంత్రిమండలి ఆమోదించింది. ఇందులో రూ.37,112 కోట్లు ఆర్థిక సంస్థలు, వాణిజ్యబ్యాంకుల ద్వారా రుణంగా తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతినిస్తూ నిర్ణయం. కొన్ని ప్రాజెక్టుల ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకురావాలనే సీఆర్డీఏ ప్రతిపాదనకు అంగీకారం. పబ్లిక్బాండ్ల ద్వారా రూ.500 కోట్లు సేకరించాలని, ఇందుకు వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాజధాని సుస్థిర మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధి పథకానికి ఆమోదం లభించింది. ఇది మొత్తం 715 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ. విదేశీ ఆర్థికసాయం పథకం కింద దీన్ని చేపడతారు. 500 మిలియన్ అమెరికన్ డాలర్లు ప్రపంచబ్యాంకు, ఇతర సంస్థల నుంచి రుణంగా తీసుకుంటారు. ఇందులో రూ.215 మిలియన్ డాలర్లు ప్రభుత్వ వాటాగా ఉంటుంది. సీఆర్డీఏ ద్వారా ఈ పథకాన్ని అమలుచేస్తారు.
భూకేటాయింపులు
- డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీకి రాజధానిలో ఎకరాకు రూ.50లక్షల వంతున చెల్లించే షరతుపై 25 ఎకరాల కేటాయింపు
- ఎకరానికి రూ.50లక్షల ధరకు సెయింట్ మాథ్యూస్ పాఠశాల, సతికాంత గుహ ఫౌండేషన్‌కు మూడు ఎకరాల చొప్పున కేటాయింపు
- అంతర్జాతీయ క్రికెట్ అకాడమీకి 33 ఏళ్ల లీజుకు ఎకరానికి రూ.10లక్షల వంతున చెల్లించేలా 12 ఎకరాలు
- 60 ఏళ్ల లీజుకు ఏటా చదరపు అడుగుకు రూ.1 నామమాత్రపు అద్దె, ఎకరాకు రూ.కోటి వంతున జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)కు రెండు ఎకరాలు
- క్రాఫ్ట్సు కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చదరపు మీటరుకు రూ.1 చొప్పున నామమాత్రపు ధరపై ఎకరం కేటాయింపు
- యంగ్‌మెన్ క్రిస్టియన్ అసోసియేషన్‌కు ఎకరానికి రూ.50లక్షల వంతున 2.65 ఎకరాలు
- మంత్రుల బృందం సిఫార్సులకు అనుగుణంగా సీఆర్డీఏ ప్రాంతంలో రామకృష్ణ మిషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 25 ఎకరాలు
- విశాఖ జిల్లా ఆనందపురం పరిధిలో చదరపు మీటరుకు రూ.679 చొప్పున ఎకరం రూ.27.47లక్షల వంతున భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఘానికి 55 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. రూ.200 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు చేయడంతో 5వేల మందికి ఉపాధి లభిస్తుంది.
- తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడులో 38.67 ఎకరాల భూమిని పరిశ్రమల పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీ కాకినాడ ప్రాంతీయ మేనేజర్‌కు అప్పగింత
- విశాఖలో ఐటీ పార్కు అభివృద్ధి నిమిత్తం భీమునిపట్నం కాపులుప్పాడ గ్రామంలో 76.88 ఎకరాల భూమిని ఏపీఐఐసీ విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్‌కు అప్పగింత
- గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట గ్రామ శివారు గోపాలంవారిపాలెంలో ఎకరాకు రూ.18.15లక్షల చొప్పున గుంటూరు టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుకు భూముల కేటాయింపునకు ఆమోదం
- కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు గ్రామంలో ఆదాయపుపన్ను శాఖ కార్యాలయం, నివాసగృహాల కోసం ఎకరానికి రూ.1.25లక్షల ధరకు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర
- కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో 2,750 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న సమగ్ర ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకరానికి రూ.2.50లక్షల చొప్పున 2,467.28 ఎకరాలు
- చిత్తూరు జిల్లా జంగాలపల్లెలో విద్యాసంస్థల ఏర్పాటుకు గాబ్రియేట్ విద్యాసంస్థకు రూ.8లక్షల ధరకు ఎకరా భూమి కేటాయింపు
- విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొంగవానిపాలెంలో 36.21 ఎకరాలు పారిశ్రామిక పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి అందజేత.
- కర్నూలు జిల్లా పెట్నికోట గ్రామంలో ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి ఎకరా రూ.3.60లక్షలు చొప్పున 6.72 ఎకరాలు
- ఆయా జిల్లాలకు వరాలు..
- చిత్తూరు జిల్లాలో మంచినీటి సరఫరా పనులకు బ్యాంకు రుణాల ద్వారా రూ.1765 కోట్లు సమీకరించేందుకు ఆమోదం
- శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బొంతు గ్రామంలో రూ.1.91 కోట్లతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఏర్పాటు
- గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో రూ.4 కోట్లతో 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్
- శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పాలకమండలిలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్‌ను సభ్యుడిగా చేసేందుకు చట్టసవరణ. విభజనకు ముందు స్విమ్స్‌లో హైదరాబాద్ నిమ్స్ డైరెక్టర్ సభ్యుడిగా ఉండేవారు. స్విమ్స్ సమావేశాలకు ఆయన రావడం లేదు. దీనివల్ల చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు.
- కర్నూలు జిల్లా బనవాసిలో మేకలు, గొర్రెల పరిశోధన కేంద్రంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం
- తిరుపతి శ్రీపద్మావతమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అదనపు బోధన, బోధనేతర పోస్టుల మంజూరు. ఒప్పంద పోస్టుల క్రమబద్ధీకరణ
- అటవీశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫారెస్ట్ పార్క్, ల్యాండ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ ఏర్పాటుపై చర్చ
పట్టణ గృహనిర్మాణానికి భూములు
- విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరం గ్రామంలో పట్టణ గృహనిర్మాణానికి 23.36ఎకరాలు. అనంతపురం జిల్లా పామిడిలో ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణానికి 25ఎకరాల కేటాయింపు. ఇక్కడ టిడ్కో ఎన్టీఆర్ గృహనిర్మాణాన్ని చేపడుతుంది.
- కేపీఆర్ పరిశ్రమకు చెందిన 243.13 ఎకరాల భూమిని గ్రాసిమ్ పరిశ్రమకు బదలాయిస్తూ నిర్ణయం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతమూరు, బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఈ భూమిలో రూ.2,700 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో కాస్టిక్ సోడా పరిశ్రమను నెలకొల్పనున్నారు. 1,300 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి.
- కాకినాడ సెజ్‌లో క్రూడ్, కెమికల్ ఉత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాటుకు హల్దియా పెట్రోకెమికల్ కంపెనీకి ప్రత్యేక రాయితీల ప్యాకేజీ ఇవ్వడానికి ఆమోదం. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్డు(ఎస్ఐపీబీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి జనవరి 3న ఉత్తర్వులు జారీ అయ్యాయి. హల్దియా పెట్రో కెమికల్స్, ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వీటిని అంగీకరిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
కాపు కోటా బిల్లుపై మరో అడుగు
- కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాపు రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలని నిర్ణయించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద కల్పించే 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం, ఇతర కులాలకు 5 శాతం చొప్పున కేటాయించేలా బిల్లును తీసుకొస్తున్నారు. బేడ, బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని సిఫారసు చేస్తూ జేసీ శర్మ కమిషన్ ఇచ్చిన నివేదికకు కూడా మంత్రివర్గ ఆమోదం లభించింది.
అగ్రిగోల్డ్ వ్యవహారం
- అగ్రిగోల్డ్ బాధితులకు అడ్వాన్సుగా రూ.250కోట్లు ఇవ్వాలనే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది.
- అగ్రిగోల్డ్ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్న కారణంగా... చెల్లింపులతో పాటు మిగిలిన విషయాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం చూపే బాధ్యతను అడ్వకేట్ జనరల్‌కు అప్పగించింది.
లిడ్‌క్యాప్ పరిధి పెంపు
- ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న లిడ్‌క్యాప్‌ను సాంఘిక సంక్షేమ శాఖ పరిధికిలోకి తేవాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎక్కువ మంది మాదిగలకు ప్రయోజనం చేకూరేలా దీని పరిధిని పెంచనున్నారు. తమకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలంటూ పలు కులాల నుంచి వస్తున్న డిమాండ్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. అది సాధ్యం కాదని తేల్చారు. బీసీ కార్పొరేషన్ పరిధిలోనే వారికి కూడా సాయం అందించాలని నిర్ణయించారు.