మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Thursday, Feb 07, 2019
ఉద్యోగులకు శుభవార్త :
1.7.2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20% ఐఆర్ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం. ఇది జూన్‌లో చెల్లించాలని నిర్ణయం.

అగ్రిగోల్డ్ :
అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి సత్వరం చెల్లింపులు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. ఏప్రిల్ మొదటి వారంలో చెల్లింపులకు అవకాశం.
అగ్రిగోల్డుపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అభినందించడంపై మంత్రిమండలిలో చర్చ. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దిని కోర్టు కూడా ఆమోదించిందని పేర్కొన్న మంత్రిమండలి.
సత్వర ఊరటగా రూ.250కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన డబ్బులు ఇవ్వడానికి హైకోర్టు అంగీకరించింది. ఇక భూముల వేలం త్వరితగతిన పూర్తిచేసి మిగిలిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా హైకోర్టు వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సి వుందని అభిప్రాయపడింది.

ఏలూరు స్మార్ట్ సిటీ :
ఏలూరు స్మార్ట్ సిటీ అంశంపై చర్చ. వినూత్న నమూనాగా స్మార్ట్ ఏలూరు అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి సూచన.

వైకుంఠపురం ఎత్తిపోతల:
వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై మంత్రిమండలిలో చర్చ. గతంలో టెండర్లలో రాలేదు. ఇప్పుడు తక్కువకు ఎవరు వేస్తే వారికి ఇచ్చేయాలని నిర్ణయం.
రాజధాని అమరావతి భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా కృష్ణానదిపై వైకుంఠాపురం దగ్గర బ్యారేజ్ నిర్మించాలని గతంలో నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజ్‌కు 23 కి.మీ. ఎగువున, పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ. దిగువున వైకుంఠాపురం బ్యారేజ్ నిర్మాణం కానుంది. మొత్తం బ్యారేజ్ పొడవు 3.068 కి.మీ. వుంటుంది.
వైకుంఠపురం దగ్గర కృష్ణానదిపై నిర్మించే ఈ బ్యారేజ్‌కు రూ. 3,278.60 కోట్లు వ్యయం కానుందని ప్రాథమిక అంచనా. దీని నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది.

JNTU అమరావతి వర్శిటీ :
JNTU అమరావతి కొత్త యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. కొత్త వర్శిటీని మోడల్ యూనివర్శిటీగా ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయం.

అకార్డ్ వర్శిటీకి భూమి :
విశాఖజిల్లా సబ్బవరంమండలం వంగలి గ్రామంలో 70 ఎకరాలభూమిని ఎకరా 10 లక్షలచొప్పున, విశాఖ రూరల్ మండలం యెండాడ గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరా కోటి రూపాయిల చొప్పున అకార్డ్ యూనివర్శిటీకి కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం.
హెల్త్ సైన్సెస్ విభాగంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన మల్టీ స్ట్రీమ్ యూనివర్శిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తారు.
చెన్నైలో వీరికి 7యూనివర్సిటీలు ఉన్నాయి. అన్ని విద్యాసంస్థలకు కలిపి 120ఎకరాలు కావాలని వీరు అభ్యర్థించారు. పదేళ్లలో రూ.5వేల కోట్లు పెడతామని అంటున్నారు. ఆలిండియా లెవల్లో ఈ సంస్థ ఏ ర్యాంకులో ఉందో పరిశీలించి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం.నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచన.

విజయనగరం యూనివర్శిటీకి గురజాడ పేరు :
విజయనగరం విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని మంత్రిమండలిలో నిర్ణయం. డిగ్రీ కళాశాల కూడా ఇవ్వాలని నిర్ణయం.
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం. విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజి పేరుమీద మంజూరు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు :
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం.

పేదలకు ఇరిగేషన్ భూములు :
జల వనరుల శాఖకు చెందిన భూములలో 2వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం. వేరే ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇవ్వాలని ఆదేశం. ఏళ్ల తరబడి నివాసం ఏర్పరచుకున్న పేదలందరికీ ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే పరిష్కరించాలని నిర్ణయం.
కర్నూలు జిల్లా సున్నిపెంటలో 76.4 ఎకరాలు, వెలిగోడు దగ్గర 20ఎకరాల భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం. మొత్తం 96.4ఎకరాల భూముల్లో పట్టాలు. జిల్లా కలెక్టర్లు పట్టాలు ఇచ్చేలా కేబినెట్ ఆమోదం.

ఇతర కేటాయింపులు :
కాకినాడ వెంకట్ నగర్‌లో ఉన్న 1040 చదరపు గజాల భూమినికల్యాణ మండపం నిర్మాణం నిమిత్తం వీవర్స్ కమ్యూనిటీకి 25 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం.
అనంతపురం జిల్లా మడకశిర మండలంలో గల పరిగి, సెరికొలెం గ్రామాలలోని 256.61 ఎకరాల భూమిని బెనిఫిసెంట్ నాలెడ్జ్ పార్కుకు ఇవ్వాలన్న ఏపీఐఐసీ ప్రతిపాదనకు మంత్రిమండలి అంగీకారం.

మినహాయింపులు :
రాజమహేంద్రవరంలో గల రామకృష్ణ మఠానికి రూ.23,49,981 విలువ గల ప్రాపర్టీ టాక్స్ బకాయిల నుంచి మినహాయింపును ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. రామకృష్ణ మిషన్ పేదలకు ఉచితంగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నందున ఈ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం.
విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్మిస్తున్న భవనానికి సంబంధించి రూ.48,36,273 విలువ గల బిల్డింగ్ లైసెన్స్ ఫీజును మినహాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం నాయునిపల్లి గ్రామంలో 48.53 ఎకరాల ప్రభుత్వ భూమిని అఫర్డబుల్ హౌసెస్ నిర్మాణం కోసం విజయవాడలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సీఎండీకి అప్పగించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం. మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ.5 లక్షల చెల్లించే షరతులకు లోబడి భూమి కేటాయింపు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట గ్రామంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకోసం 6.96 ఎకరాల
AWD భూమి గుంటూరు టెక్స్‌టైల్ పార్క్ యాజమాన్యానికి కేటాయింపు. ఎకరాకు రూ.18,15,000 చెల్లించే షరతు మీద కేటాయింపు.

ఇతర కేటాయింపులు :
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు బదులుగా అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 20 ఎకరాలు కేటాయింపు (కేవలం సంస్థ పేరులో స్వల్ప మార్పు)నకు మంత్రిమండలి నిర్ణయం
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామంలో లోర్విన్ గ్లాస్ టఫనింగ్ యూనిట్ ఏర్పాటుకు 2 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రిమండలి నిర్ణయం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల కేంద్రంలో (1 బిల్డింగ్ పెయింటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కు 0.10 ఎకరాలు; 2 బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కు 0.10 ఎకరాలు; 3 కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ కు 0.15 ఎకరాలు; 4 ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ 0.10 ఎకరాలు) మొత్తం 0.45 ఎకరాలు కేటాయింపునకు మంత్రి మండలి ఆమోదం. యూనియన్ భవనాల నిర్మాణానికి ఈ భూమి కేటాయింపు.
ప్రకాశం జిల్లా కొండెపి మండలం పరిడేపి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి శ్రీమతి ఎం.కళ్యాణికి ఒంగోలు పట్టణంలో ఉచితంగా స్థలం కేటాయింపుకు మంత్రిమండలి నిర్ణయం.
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని తోటపల్లి గ్రామంలో 50 ఎకరాల భూమిని.. ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి కేటాయింపు. సమగ్ర ఇంటిలిజెన్స్ శిక్షణ అకాడమీ కోసం భూమిని కేటాయస్తూ మంత్రి మండలి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎపేడెకో) ఏర్పాటుకు విజయవాడ గ్రామీణ మండలం.. జక్కంపూడి, వేమవరం గ్రామాల్లో 153 ఎకరాల భూమి కేటాయింపు. దీనిలో వేమవరంలో 60 ఎకరాలు, జక్కంపూడిలో 93 ఎకరాలున్నాయి. జక్కంపూడిలో మార్కెట్ ధర ఎకరాకు రూ. కోటి, వేమవరంలో మార్కెట్ ధర ఎకరా రూ. 50 లక్షల చొప్పున ధర నిర్ధారణ.
విజయనగరం జిల్లా కవులవాడ, రావాడ, ముంజేరు, కంచేరుపాలెం, గూడెపువలస, కంచేరు గ్రామాల్లో 500.14 ఎకరాల భూమిని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కేటాయింపు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెం గ్రామంలో మెగా పుడ్ పార్క్ ఏర్పాటుకు 70.18 ఎకరాల భూమి ఏపీఐఐసీకి అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం (ఉచితంగా)
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి గ్రామంలో కియా మోటార్స్ ఆర్వోబీ, వై జంక్షన్ ఏర్పాటుకు 5.89 ఎకరాలు భూమి ఏపీఐఐసీకి కేటాయింపు.
అలాగే... అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి గ్రామంలోనే ట్రక్ టెర్మినల్, రైల్వే సైడింగ్ ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయింపు
రెంటచింతల మండలం గోలి గ్రామం వద్ద జెట్టిపాలెంలో పరాశక్తి సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. తన 6.85 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్‌కు పైప్ లైన్, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు 2.85 ఎకరాల భూమి కేటాయింపు

పాడేరు ఏరియా ఆసుపత్రి స్థాయి పెంపు :
విశాఖ జిల్లా పాడేరు ఏరియా ఆసుపత్రి 100 పడకల ఆస్పత్రి స్థాయి నుంచి 200 పడకల జిల్లా ఆస్పత్రి స్థాయికి పెంపు. రూ.27.50 కోట్ల అంచనా వ్యయంతో పోస్టుల మంజూరు. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల మంజూరు. సివిల్ సర్జన్ పోస్టులు 7, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టు 1, డిప్యూటీ డెంటల్ సర్జన్ 1, సివిల్ అసిస్టెంట్ సర్జన్/ఉమెన్ అసిస్టెంట్ సర్జన్ 6, హెడ్ నర్స్ 4, లే సెక్రటరీ గ్రేడ్ II అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ 1, ఆఫీసు సూపరింటెండెంట్ పోస్టులు 2, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 3, స్టాఫ్ నర్స్ పోస్టులు 38, టేబుల్ 1 కింద మొత్తం 63 పోస్టులు మంజూరు. టేబుల్ 2 కింద మరో 57
పోస్టులు మంజూరు.

బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ పోస్టుల భర్తీ :
బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలకు 9 టీచింగ్ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. ప్రపంచంలో వస్తున్న ఆధునిక సేద్య పద్ధతులు, అధికోత్పత్తికి, ఉత్పాదనకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కర్షకులకు పరిచయం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు. ఇందుకు వీలు కల్పిస్తూ వీరి నియామకం.

ఇతర పోస్టులు :
ల్యాండ్ హబ్ (భూసేవ) ప్రాజెక్టు నిమిత్తం అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పద్దతిలో నియమించుకునేందుకు మంత్రిమండలి ఆమోదం.
కృష్ణాజిల్లా నిమ్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం. అంచనా వ్యయం రూ.568.91 కోట్లతో పోస్టుల మంజూరు. రెగ్యులర్ ప్రాతిపదికన అదనంగా 11 పోస్టులు మంజూరు. రేడియోగ్రాఫర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, 4 నర్సింగ్ సిబ్బంది, 7 శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మేన్ పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్దతిలో నియామకం.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో రూ.191.19 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం. పోస్టుల మంజూరు. ఫార్మసిస్టు గ్రేడ్-2, లాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ అసిస్టెంట్, శానిటరీ అటెండర్/వాచ్‌మేన్ పోస్టులను ఔట్ సోర్సింగ్ సిబ్బందితో భర్తి చేయాలని నిర్ణయం
నంద్యాలలో ప్రస్తుతం ఉన్న 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నతీకరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. మొత్తం 46 పోస్టులు మంజూరు. సివిల్ అసిస్టెంట్ సర్జెన్ పోస్టులు 3, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్ 1, హెడ్ నర్సులు 4, స్టాఫ్ నర్సులు 33, ఆఫీస్ సూపరింటెండెంట్ 3, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల మంజూరు.

ఇంధన రంగం :
సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్ నుంచి విద్యుత్తు ప్రొక్యూర్ మెంట్‌. విద్యుత్తు ఎంత సేకరించాలి
కొనుగోలు ధర ఖరారు విధివిధానాల ఖరారుకు APERC ముందు ప్రతిపాదించేందుకు APPCC/AP DISCOMSకు రాష్ట్ర మంత్రిమండలి అనుమతి.
విద్యుత్ ప్రొక్యూర్‌మెంట్ కోసం సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్‌కు ముందుగా ఇఛ్చిన లీజు కాల పరిమితి 12 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు కుదింపు.
సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్‌కు ప్రొక్యూర్‌మెంట్‌తో హెచ్.ఎన్.పి.సి.ఎల్, కె.ఎస్.కె మహానంది, శ్రీ వాస్తవ, RTTP, VTPS ఒప్పందాన్ని కొనసాగించరాదని మంత్రిమండలి నిర్ణయం. అగ్రిమెంట్ కాలపరిమితి 2017-18 నుంచి 2021-22 నాటికి ముగియనుంది.
Write Comments
Comments 4
Similar Updates