ఆహ్లాదంగా ‘హ్యాపీ నెస్ట్’
ఆహ్లాదంగా ‘హ్యాపీ నెస్ట్’

ఆహ్లాదంగా ‘హ్యాపీ నెస్ట్’

ఆహ్లాదంగా ‘హ్యాపీ నెస్ట్’

Thursday, Nov 08, 2018

  • సామాజిక మౌలిక సదుపాయాల కల్పన
  • ఆన్‌లైన్లో ముందుగా 300 ఫ్లాట్ల విక్రయం
  • తర్వాత మరో అదనంగా మరో 300
  • జనవరి ఫస్టున మొదటి టవర్ లో ఫ్లాట్లకు ప్రారంభోత్సవం
  • ఎన్.సి.సిఎల్ (పిఎంసి-సి.బి.ఆర్.ఇ) ఫ్లాట్లు డిసెంబర్ 15కు సిద్ధం
  • సి.ఆర్.డి.ఎ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ‘హ్యాపీ నెస్ట్’ ఫ్లాట్ల విక్రయం శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ముందుగా 300 ఫ్లాట్లను విక్రయానికి పెట్టనున్న సిఆర్‌డిఎ మరో 300 అదనం (బఫర్)గా ఉంచుకోవాలని, ఇందుకు తాము అనుమతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

గురువారం ఉండవల్లి ప్రజావేదికలో సిఆర్‌డిఎ 21వ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. రాజధానిలో వివిధ విభాగాల్లో నిర్మాణమవుతున్న గృహాలను, రహదారులు తదితర మౌలిక సదుపాయాలను ప్రధానంగా సమీక్షించారు. ఈ ఆరు వందల బుకింగ్ పూర్తయితే మరో 600 యూనిట్లను బుకింగ్ కోసం ఆన్ లైన్ లో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘హ్యాపీనెస్ట్’ ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రాగలదని భావిస్తున్నట్లు, గత వారం తమకు 17 వేల ఫొన్ కాల్స్ రావటమే ఇందుకు తార్కాణమని సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ‘హ్యాపీనెస్ట్’ ఫ్లాట్లలో సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. మొదట వచ్చిన వారికే మొదటి కేటాయింపు ప్రాతిపదికన పూర్తి పారదర్శకత పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులకు హ్యాపీనెస్ట్ తరహా గృహాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

భూమి ధరను చూసి నైష్పత్తిక ప్రాతిపదికన ధర నిర్ణయించాలని సీఎం కోరారు. గరిష్టంగా చదరపు అడుగు ఒక్కింటికి రూ.4000 నుంచి రూ.7 వేల లోపు మించకుండా ధర నిర్ణయించాలని ముఖ్యమంత్రి సూచించారు. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా మరో 1200 ఫ్లాట్లను నిర్మించవచ్చని అన్నారు.

హైదరాబాద్ లో కొన్ని న్యాయపరమైన వివాదాల వల్ల తమకు ఇళ్లు రాలేదని, అందువల్ల తాము తమకు అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎన్జీఓలు కోరుతున్నారని కొన్ని రాయితీలు, మినహాయింపులు అడుగుతున్నారని కమిషనర్ శ్రీధర్ సీఎం దృష్టికి తేగా ఎన్జీఓలకు వేతన స్కేళ్లకు అనుగుణంగా స్థలాల కేటాయింపునకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలన్నారు.

రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణాలకు మానవ వనరులను ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా పెంచుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వారం రోజులలో మానవ వనరుల లభ్యత పెంచుతామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. విభాగాలన్నీ సమన్వయంతో పనిచేస్తే లక్ష్య సాధన కష్టం కానేకాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

గృహనిర్మాణాల పనుల వేగవంతం
రాష్ట్రంలో గృహ నిర్మాణాల పనులను ఈ సమావేశంలో సమీక్షిస్తూ జనవరి 19 లోగా 1.2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గృహనిర్మాణాల్లో లబ్ది దార్ల ఎంపికలో పారదర్శకతను పాటించాలని కోరారు. ప్రాజెక్టుల పనుల్లో ఆలస్యం జరగటానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. వనరుల సమీకరణకు తాను సమావేశం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

సిఆర్‌‌డిఎ తదుపరి సమావేశంలో రహదారుల మౌలిక సదుపాయాలను సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గృహనిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలలో నిర్దేశిత లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఇందులో ఎటువంటి రాజీలేదని స్పష్టం చేశారు.

జనవరి ఫస్టున మొదటి టవర్ లో ఫ్లాట్లకు ప్రారంభోత్సవం
ఎన్.సి.సిఎల్ (పిఎంసి-సి.బి.ఆర్.ఇ) ఫ్లాట్ల నిర్మాణంపై సమీక్షలో సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వివరణ ఇస్తూ డిసెంబర్ 15 నాటికి మొదటి టవర్ లోని 24 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. జనవరి ఫస్టున ప్రారంభోత్సవం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహ రూపకల్పన పనులను, శాఖమూరు పార్కు నమూనాలపై సీఎం పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

గ్రామీణ ప్రాంతాల సుందరీకరణకు ప్రాధాన్యం
గ్రామాలలో నివాస ప్రాంతాలను సుందరంగా, గేటెడ్ కమ్యూనిటీలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇది తదుపరి ప్రాధాన్యతగా పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్లనే విజయవాడలో క్రమంగా సుందరీకరణ పనులు పూర్తవుతున్నాయని, అందమైన చిత్రాలతో గోడలను చక్కగా తీర్చిదిద్దటం సాధ్యమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు, గన్నవరం నుంచి విజయవాడ వరకు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ‌సిఆర్‌డిఎ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే చాలా అందంగా నగరాలనైనా, గ్రామాలనైనా చూడముచ్చటగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. అన్ని గ్రామాల్లో సుందరీకరణకు అవసరమైన మొక్కలు నాటాలని, అన్ని గ్రామాలను గేటెడ్ కమ్యూనిటీల్లా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాలు నందనవనాల్లా కన్పించాలన్నారు.

నగరంలో కాల్వల సుందరీకరణకు అవరోధంగా ఉన్న అవరోధాలను తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే అమరావతి నగరంలో ప్రవేశించే ముఖ ద్వారం అభివృద్ధి కూడా ముఖ్యమేనని అన్నారు. కొండ ప్రాంతాలను సుందరీకరణ చేపట్టాలని సీఎం కోరారు. రాజధాని ప్రాంతంలో కొండలు ఎన్ని ఉన్నాయో నోటిఫై చేయాలని సూచించారు. కొండ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసిన తర్వాత ఈ చర్యలన్నీ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అమరావతి, పరిసరాల్లో త్రీస్టార్, ఫోర్ స్టార్ హెటళ్ల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి కోరారు. పదివేల గదులను త్వరగా అందుబాటులోకి తేవాలని, ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యంమంత్రి సూచించారు.

మానవ వనరులను పెంచుకోవాలి:
రహదారి, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు మానవ వనరులను క్రమంగా పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పనులను లక్ష్యాల మేర పూర్తిచేయడానికి మానవవనరులు ముఖ్యమని అన్నారు. సిఆర్‌డిఎ వివిధ ప్రాజెక్టులలో పనులకు గాను 11,237 మంది కార్మికుల అవసరం ఉందని, ఇప్పటికి 8,428 మంది పనిచేస్తున్నారని క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ పార్ధసారథి వివరించారు. భవనాలు, ఎల్.పి.ఎస్, రహదారుల నిర్మాణాలకు 29,120 మంది పనివారు అవసరం కాగా 16,408 మంది లభ్యత ఉందని తెలిపారు. అలాగే ఎల్.పి.ఎస్ 1, 2, 3, 6, 7,10 జోన్లలో 16,698 మంది పనివారు కావాల్సి ఉండగా ప్రస్తుతం లభ్యత 7,230 గా ఉందని వివరించారు.
Write Comments
Comments 9
Similar Updates