ఐదేళ్లలో కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం
ఐదేళ్లలో కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం

ఐదేళ్లలో కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం

ఐదేళ్లలో కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం

Monday, Nov 12, 2018

  • పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం
  • నాణ్యత, జలవనరుల ఆదా, వ్యయం తగ్గించడమే లక్ష్యం
  • మైక్రో ఇరిగేషన్ కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి
రాష్ట్రంలో కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేయాలన్న లక్ష్యాన్ని ఐదేళ్లలో అధిగమించేందుకు సన్నద్ధం కావాలని మైక్రో ఇరిగేషన్ కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఏడాది 8.75 లక్షల ఎకరాల్లో, వచ్చే ఏడాది 12.50 లక్షల ఎకరాల్లో సూక్ష సేద్యం సాగు చేయాలని నిర్ణయించామని చెప్పిన ముఖ్యమంత్రి జలవనరులు ఆదా చేయడం, పెట్టుబడి వ్యయం తగ్గించగలగడం, నాణ్యతా ప్రమాణాలు పాటించడంపై కంపెనీలు దృష్టి పెట్టాలన్నారు. సూక్ష్మ సేద్యానికి ఉపయోగించే పైపులు, పరికరాలు కనీసం పదేళ్లకు పైగా మన్నేలా ఉండాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం విస్తరణకు అనుసరిస్తున్న కార్యాచరణను వారికి వివరించారు.

2014 నుంచి ఇప్పటివరకు 5,62,355 హెక్టార్లలో అదనంగా సూక్ష్మ సేద్యం సాగు చేశామని, దీంతో రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం కింద సాగవుతున్న భూమి మొత్తం 11.25 లక్షల హెక్టార్లకు చేరిందని సీఈవోలతో ముఖ్యమంత్రి అన్నారు. స్ప్రింక్లర్ల ద్వారా సాగు కన్నా డ్రిప్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. రైతులపై భారం తగ్గించేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలని చెప్పారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంతో సూక్ష్మ సేద్యాన్ని అనుసంధానించేందుకు ప్రయత్నించాలని నిర్దేశించారు. మైక్రో ఇరిగేషన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.

సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి పాల్గొన్నారు.
Write Comments
Comments 4
Similar Updates