పోలవరానికి అటు అవార్డులు-ఇటు రివార్డులు
పోలవరానికి అటు అవార్డులు-ఇటు రివార్డులు

పోలవరానికి అటు అవార్డులు-ఇటు రివార్డులు

పోలవరానికి అటు అవార్డులు-ఇటు రివార్డులు

Monday, Dec 24, 2018
  • అయినా నిధుల విడుదలలో కేంద్రం జాప్యం దారుణం
  • నీరు-ప్రగతి పురోగతిపై టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి
‘‘ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. పోలవరానికి తొలిగేటు బిగింపు శుభ సందర్భం. 22గంటల్లో 16,368క్యూ.మీ కాంక్రీట్ లో చైనా రికార్డు అధిగమించాం. కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు కూడా అధిగమిస్తాం. పోలవరానికి సిబిఐపి అవార్డు మనందరికీ గర్వకారణం. పోలవరానికి అటు అవార్డులు, ఇటు రికార్డులు. ఇది సమష్టి ఘనత.. ఇది సమష్టి బాధ్యత.. ఈ ఘనత అందరికీ చెందుతుంది. ప్రజల సహకారం, అధికార యంత్రాంగం తోడ్పాటుతోనే ఈ విజయం. దీనికి కేంద్రం సహకారం కూడా తోడైతే మరింత అభివృద్ధి సాధించేవారం. ఏ రంగం అభివృద్ధి సాధించాలన్నా జలవనరులే కీలకం’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

‘‘రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తోడ్పాటు లేదు. అయినా పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం. కేంద్రం అడుగడుగునా ఇబ్బందులు పెడుతోంది. దేనినైనా ఎదుర్కోగల సత్తా మనకుంది. ప్రజా సహకారంతో వీటన్నింటినీ అధిగమిస్తున్నాం. వ్యవసాయ వృద్దిలో దేశంకన్నా 5రెట్లు ఎక్కువ సాధించాం. పొరుగు రాష్ట్రం కన్నా 30 రెట్లు ముందున్నాం. నాలుగేళ్లలోనే రైతుల ఆదాయం రెట్టింపు చేశాం. చేపట్టిన వినూత్న పథకాలన్నీ సత్ఫలితాలు. నదులు అనుసందానం చేశాం. భూగర్భ జలాలు పెంచాం. పశు సంవర్ధకం, ఆక్వాలో రాబడి పెంచాం. మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే నమూనా. సంపద సృష్టించడంలో అధికార యంత్రాంగమే కీలకం’’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

తుపాన్ బాధితులకు నగదు కొరత లేకుండా చూడాలి: సీఎస్ పునేటా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటా ఆ తరువాత అధికారులతో టెలికాన్ఫరెన్స కొనసాగించారు. పునేటా మాట్లాడుతూ,‘‘తుపాన్ బాధితులకు నగదు కొరత లేకుండా చూడాలి.తుపాన్ బాధిత రైతులకు బ్యాంకర్లు పూర్తి తోడ్పాటు అందించాలి.పెథాయ్ పంటనష్టం అంచనాలు వెంటనే పూర్తి చేయాలి. రబీ పంట రుణాల పంపిణీ లక్ష్యం చేరుకోవాలి. గ్రామీణ ఆదాయం పెంచేందుకు పశు సంపదే కీలకం. పశుపోషణ ద్వారా కుటుంబాలకు అధిక రాబడి. గ్రామాల్లో పశుగణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆక్వా ద్వారా అదనపు రాబడి వచ్చేలా చేయాలి.

నరేగా పనుల లక్ష్యాన్ని అధిగమించాలి. ఘన వ్యర్ధాల నిర్వహణకు 7,700 షెడ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగిలిన 1300షెడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇంకా 1200కి.మీ సిసి రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి వుంది. ఇంకుడు కుంటల తవ్వకం పనులు వేగం పుంజుకోవాలి. కరవు ప్రాంతాలలో అదనపు పనిదినాలపై ప్రచారం చేయాలి. 150 పనిదినాలను సద్వినియోగం చేయాలి. క్రిస్మస్ కానుకల పంపిణీ ఈ సాయంత్రానికల్లా పూర్తి చేయాలి’’ అని పునేటా ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులు రాజశేఖర్, మురళీ ధర్ రెడ్డి, జవహర్ రెడ్డి, గోపాలకృష్ణ ద్వివేది, రామాంజనేయులు, చిరంజీవి చౌదరి, రంజిత్ బాషా, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Write Comments
Comments 2
Similar Updates