నాలుగున్నరేళ్ల రాష్ట్ర పురోగతిపై శ్వేతపత్రాలు
నాలుగున్నరేళ్ల రాష్ట్ర పురోగతిపై శ్వేతపత్రాలు

నాలుగున్నరేళ్ల రాష్ట్ర పురోగతిపై శ్వేతపత్రాలు

నాలుగున్నరేళ్ల రాష్ట్ర పురోగతిపై శ్వేతపత్రాలు

Thursday, Dec 20, 2018
  • ప్రణాళికా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి భేటి
  • నాలుగున్నరేళ్ల రాష్ట్ర పురోగతిపై సవివరణాత్మక నివేదికలు
  • 9 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం
నాలుగున్నరేళ్ల రాష్ట్ర పురోగతిపై సవివరణాత్మక నివేదికలు, శ్వేత పత్రాలు విడుదల చేయాలని, ప్రజల్లో వాటిపై చర్చజరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజన సమస్యలను ఎదుర్కోవడం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, విద్యా, వైద్యరంగాల పురోగతి, జలవనరుల అభివృద్ధి-నీటి పారుదల ప్రాజెక్టుల పురోగతి, మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమలు-ఉపాధి కల్పన, సేవారంగం పురోగతి, వివిధ వర్గాల సంక్షేమం తీరుతెన్నులు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. వీటిపై 9 శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా వీటిలో 2014 శ్వేతపత్రాల నేపథ్యం వివరించాలని రాష్ట్ర విభజన సమస్యలు, అప్పటి సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తావించి, ఇప్పుడు సాధించిన పురోగతి, భవిష్యత్ దిశానిర్దేశం వాటిలో ఉండాలని సూచించారు.

9 శ్వేత పత్రాలను రోజుకొక్కటి విడుదల చేయనున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా చర్చ జరగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా ‘జన్మభూమి-మావూరు’ గ్రామసభల్లో వీటిపై చర్చించేలా, వాస్తవాలను ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి సూచించారు. '2014 శ్వేతపత్రాలలో సమస్యలను హైలెట్ చేశాం. రాష్ట్ర విభజన సవాళ్లను వివరించాం. ఇప్పటి శ్వేతపత్రాలలో సాధించిన పురోగతి ప్రతిబింబించాలి. రాబోయే 5 ఏళ్లకు దిశానిర్దేశం చేయాలి. ఇంత ఆర్ధికలోటులో కూడా, ఇన్ని సవాళ్ల నడుమ కూడా ఎంత అభివృద్ధిని సాధించామో వివరించాలి. శ్వేతపత్రాలు వాస్తవికతను ప్రతిబింబించాలి. నిజాలను వెల్లడించాలి' అని తెలిపారు.

'రాష్ట్రంలో రైతుల ఆదాయం నాలుగేళ్లలో రెట్టింపు అయ్యింది. దేశంలో రెట్టింపు చేస్తామన్న వాళ్లు చేయలేక పోయారు.
17 ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రారంభించాం. మరో 14ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్తగా మరో 14 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. పేదల సంక్షేమానికి చేస్తున్న పథకాలను వివరించాలి. తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచి జీవితాంతం వరకు సంక్షేమం, పుట్టుకలో,బాల్యంలో, చదువులో, ఉపాధిలో, వివాహానికి, సొంతింటి నిర్మాణానికి, వైద్యంలో, వృద్ధాప్యంలో అనేక పథకాలు తెచ్చాం.' వాటిని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

నాలుగున్నరేళ్లలో నెలకొల్పిన యూనిట్లు, ముఖ్యమంత్రి యువనేస్తం అన్నింటిని చెప్పాలని సమావేశంలో పేర్కొన్నారు. వివిధ శాఖలు సాధించిన అవార్డులు, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కావడం వివరించేలా నివేదికలు రూపొంచాలని నిర్ణయించారు. శ్వేతపత్రాలతో పాటుగా డెవలప్ మెంట్ ప్లాన్లు(అభివృద్ధి నివేదికలు) కూడా రూపొందించాలని, గ్రామ, మండల, జిల్లా అభివృద్ధి నివేదికలు విడుదల చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి నివేదిక(స్టేట్ డెవలప్ మెంట్ ప్లాన్) తయారీ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. జనవరి ‘జన్మభూమి-మావూరు’ గ్రామసభలో వాటిని ప్రజల ముందు ఉంచాలన్నారు.
Write Comments
Comments 9
Similar Updates