మన కష్టంతోనే పోలవరం
మన కష్టంతోనే పోలవరం

మన కష్టంతోనే పోలవరం

మన కష్టంతోనే పోలవరం

Monday, Feb 25, 2019
కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి డబ్బులివ్వకున్నా సొంత ఖర్చుతో పోలవరం నిర్మిస్తున్నాం, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గ్రావిటీ ద్వారా నీరివ్వటానికి ఇంకా 12 వారాలే సమయం ఉంది. అందుకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి.
Short descreption:
పోలవరం ప్రాజెక్టు 89వ వర్చువల్ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
BLOG:

కేంద్రం నిధులివ్వకున్నా భారం మోస్తున్నాం
వేగం పెంచి జూన్ కల్లా నీరిద్దాం
నిర్మాణ సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి డబ్బులివ్వకున్నా సొంత ఖర్చుతో పోలవరం నిర్మిస్తున్నామని, అందువల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పనులు వేగంగా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు దిశా నిర్దేశం చేశారు. గ్రావిటీ ద్వారా నీరివ్వటానికి ఇంకా 12 వారాలే సమయం ఉందని, వారం వారం పనుల పురోగతిని సమీక్షించుకుని అందుకు అనుగుణంగా నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు 89వ వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్రానికి రూ.4,063 కోట్లు కేంద్రం బకాయి పడిందని సీఎం అన్నారు.

ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 66.36% పూర్తికాగా, తవ్వకం పనులు 82.60%, కాంక్రీట్ పనులు 65.30% పూర్తయినట్టు అధికారులు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90.29%, ఎడమ ప్రధాన కాలువ 68.74%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 62.83%, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 25.73%, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 10.17% పూర్తయినట్టు పేర్కొన్నారు. గతవారం స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 3.89 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయిన తవ్వకం పనులు, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 56 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయినట్టు తెలిపారు. మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 25.37 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు, మొత్తం 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకంకు గాను 966.19 క్యూబిక్ మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయన్నారు.

అటు ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి రానున్న వేసవిపై దృష్టి పెట్టాలని, చెరువులు నింపాలని అధికారులను ఆదేశించారు. మార్చి 15 కల్లా చిత్తూరుకు కృష్ణా జలాలను తరలించాలని సూచించారు.సూక్ష్మ సేద్యంలో ప్రస్తుతం దేశంలో రెండో స్థానంలో ఉన్నామని, వచ్చే నెలకల్లా మొదటి స్థానానికి చేరేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జాతీయ జల అవార్డులలో ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం దక్కడంపై జలవనరుల శాఖకు సీఎం అభినందనలు తెలిపారు.

సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పోలవరం ఆర్&ఆర్ కమిషనర్ రేఖారాణి, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Write Comments
Comments 12
Similar Updates