అర్చకులు సంతోషంగా ఉండాలనే జీతాల పెంపు
అర్చకులు సంతోషంగా ఉండాలనే జీతాల పెంపు

అర్చకులు సంతోషంగా ఉండాలనే జీతాల పెంపు

అర్చకులు సంతోషంగా ఉండాలనే జీతాల పెంపు

Friday, Feb 22, 2019
  • క్యాడర్ పటిష్టతకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు
  • ముఖ్యమంత్రికి అర్చకుల కృతజ్ఞతలు
పవిత్రమైన వృత్తి నిర్వర్తిస్తూ భక్తులకు, భగవంతునికి అనుసంధాన కర్తలైన పురోహితులు పేదరికంలో ఉండటం తమను కలచివేసిందని, అందుకే వారి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రూ. 5,000 పొందుతున్న అర్చకులకు జీతాన్ని రూ.8,000కు పెంచామని, రూ.10,000 జీతాలు పొందుతున్న అర్చకులకు రూ.12,500 పెంచామని సీఎం వివరించారు. ఇందుకోసం రూ.16 కోట్లు ఇవ్వాలని టీటీడీ బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తమ కోర్కెలను సానుభూతితో పరిశీలించి ఆమోదించినందుకు అర్చకులు గురువారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి స్పందిస్తూ రూ.2 లక్షల ఆదాయం ఉండే దేవాలయాల బాధ్యతను ఆయా గ్రామాలలో ధార్మిక భావాలు కలిగిన దాతను ఎంపిక చేసి, అర్చకులతో ఒక కమిటీ వేసి కమిషనర్ ద్వారా పరిపాలన చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అర్చకుల కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నది తమ ఆకాంక్ష అని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని సీఎం స్పష్టం చేశారు.


ఉద్యోగుల క్యాడర్‌ను పటిష్టం చేయాలని దేవాదాయ కమిషనర్‌ను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గొల్లపూడిలో ఉన్న భవనాన్ని అర్చకులకోసం ఇవ్వాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జీవో నెం.176 ద్వారా నలుగురు అర్చక ప్రతినిధులతో అర్చక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశామని, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్టేషన్ (ఎస్.ఐ.టి.ఎ)ను నెలకొల్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

ఇవి అర్చకుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ సిఫారసులను అనుసరించి అన్ని దేవాలయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు. భూ సేకరణ జరిగిన చోట, అర్చకులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అర్హత ఉన్న అర్చకులందరికీ కోడ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని దేవాలయాల్లో ఇలవేల్పులకు దూప, దీప, నైవేద్య కార్యక్రమాలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. అర్చకులకు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల కోసం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్, పురోహితుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Write Comments
Comments 17
Similar Updates