ఇంటికో మహిళా పారిశ్రామికవేత్త, మహిళా వ్యాపారవేత్త
ఇంటికో మహిళా పారిశ్రామికవేత్త, మహిళా వ్యాపారవేత్త

ఇంటికో మహిళా పారిశ్రామికవేత్త, మహిళా వ్యాపారవేత్త

ఇంటికో మహిళా పారిశ్రామికవేత్త, మహిళా వ్యాపారవేత్త

Thursday, Mar 07, 2019
  • మహిళా సాధికారతకు అర్ధాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వం మాది
  • పసుపు-కుంకుమ రెండో విడత సొమ్ము బ్యాంకుల్లో జమ
  • ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

మహిళలు అన్నింటా మగవారితో సమానంగా ఉండాలన్నదే తమ ఆశయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నారీ లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత లేని సమాజాన్ని ఊహించడం కష్టమని, ఒక మహిళ చదువుకుంటే కుటుంబమంతా విజ్ఞానవంతులు అవుతారని అన్నారు. మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నేడు పసుపు-కుంకుమ రెండో విడత సొమ్ము

తొంభై నాలుగు లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు పసుపు-కుంకుమ కింద రెండో సారి ఇస్తున్న రూ.10 వేల సొమ్ములో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన రూ.3,500 అందుతాయని, ఇందుకు అవసరమైన సొమ్మును బ్యాంకులలో జమచేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లు త్వరలో ప్రతి ఒక్క స్వయం సహాయక మహిళ బ్యాంకు ఖాతాలో మిగిలిన రూ.4000 జమచేస్తామని సీఎం అన్నారు.

రాష్ట్రంలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిహక్కును తీసుకొచ్చి మహిళా సాధికారతకు మహానాయకుడు ఎన్టీరామారావు బాట వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్లాఘించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలలో, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు. దళిత మహిళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా చేశామని, కేబినెట్ లోకి మహిళా మంత్రులను తీసుకున్నామని తెలిపారు.
రెండు పర్యాయాలు అంగన్ వాడీల జీతాలు పెంపు


నవ్యాంధ్రప్రదేశ్ లో మహిళా సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. అంగన్ వాడీ టీచర్లు, సహాయకుల జీతాలను రెండు దఫాలుగా పెంచామని సీఎం చెప్పారు. ఐదేళ్ల కాలంలో 18,301 అంగన్ వాడీ కేంద్రాలు, అలాగే 103 సీడీపీఓ కార్యాలయాలకు భవనాలను నిర్మించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. మహిళా హోమ్ గార్డుల ప్రసూతి సెలవు పెంచినట్లు తెలిపారు.
‘బడికొస్తా‘ పథకం కింద 5.61 లక్షల సైకిళ్ల పంపిణీ

స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి ‘బడికొస్తా’ పథకం కింద రూ.207 కోట్ల వ్యయంతో 5.61 లక్షల సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. మూడు లక్షలమంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించామని, 55,607 అంగన్ వాడీల ద్వారా 40 లక్షల మంది లబ్ది పొందారని చెప్పారు.

తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం ద్వారా 7.45 లక్షల మందికి లబ్ది

తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా 7.45 లక్షలమంది లబ్ది పొందినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్తులో మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు స్ఫూర్తిగా ‘అమరావతి డిక్లరేషన్’ తీసుకొచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మహిళలకు సామాజిక భద్రత కల్పించామని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా వారిపై వివక్ష కొనసాగుతోందని, మహిళలకు సాధికారత లభిస్తే సమాజానికి మేలు జరుగుతుందనని అన్నారు. ప్రతి ఇంటా ఒక మహిళా వ్యాపారవేత్త, ఒక మహిళా పారిశ్రామిక వేత్త తయారు కావాలన్నది తమ ఆశయమన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో వచ్చిన మొబైల్ పరిశ్రమల్లో మహిళలకే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయని ఇది మంచి మార్పునకు సంకేతమని చంద్రబాబు అన్నారు.
Write Comments
Comments 8
Similar Updates